‘హెలెన్ కెల్లర్స్’ ఆధ్వర్యంలో ‘ఆర్‌సీఐ, సీఆర్‌ఈ’ విద్యా సంస్థలచే ప్రోగ్రాం నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ ౨౫ (విజయక్రాంతి): హెలెన్ కెల్లర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆర్‌సీఐ, సీఆర్‌ఈ ప్రోగ్రాం రెండు రోజులు నిర్వ హించారు. దీనికి వివిధ ప్రాంతాల నుంచి పునరావాస వృత్తి నిపుణులు హాజరయ్యారు. ఈ వృత్తిలో ఉన్న వారికి రియాబిలిటేషన్ ప్రొఫెషనల్ ఈ పాయింట్ ఆధారంగా ఈ వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకొని మళ్ళీ తిరిగి వారు విధుల్లో చాలా యాక్టివ్ గా పని చేస్తారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ దాసరి సునీత ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
అదేవిధంగా గెస్ట్ ఆఫ్ హనర్‌గా ఈ సంస్థ చైర్మన్ ఉమ్మర్ ఖాన్, సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ముగం హాజరయ్యారు. ఈ సీఆర్‌ఈ ప్రోగ్రాంకి కోఆర్డినేటర్‌గా శైలజ వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం మొత్తానికి వక్తగా డాక్టర్ శశిధర్ రెడ్డి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ సునీత స్పెషల్ ఎడ్యుకేషన్ ఆవశ్యకత స్పెషల్ చిల్డ్రన్‌లో శ్రద్ధ వారికి కావల్సిన ఏర్పాట్లు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రాము ఖ్యత ఎంతో చక్కగా తన కీనోటు ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.
అదేవిధంగా పటాన్ ఉమ్మర్ ఖాన్ చైర్మన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో దాంట్లో జరుగుతున్న లోటుపా ట్లు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన వివరించారు.అలాగే ఇందులో పాల్గొన్న ఎం తోమంది ప్రఖ్యాత రిసోర్స్ పర్సన్స్ ఈ ఫీల్డ్‌లో ఎంతో కాలంగా పనిచేసే ఎంతో అనుభవంతులు ఉండి వారు చక్కని వివరణాత్మకమైన సమాచారాన్ని రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్‌కి ఈ రెండు రోజులపాటు తెలియజేయడమైం ది. ఈ కార్యక్రమం రెండు రోజులుగా ఎంతో దిగ్విజయంగా అందరు ప్రొఫెషనల్స్ ఎంతో చురుగ్గా పాల్గొని ప్రతి సెషన్ ఒక ఆనందంతో శ్రద్ధతో వారి నాలెడ్జ్‌ని అప్డేట్ చేసుకున్నారు. కార్యక్రమంలో చివరిగా అందరూ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ వారి వారి వ్యక్తిగత అభి ప్రాయాన్ని తెలియజేసి ఒక గ్రూప్ ఫొటో తీసుకొని దాంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.






