4 May, 2026 | 3:40 AM

మాల్దీవులకు ఆర్‌సీబీ ప్లేయర్స్

04-05-2026 02:15 AM

సీజన్ మధ్యలో స్పెషల్ ట్రిప్

బెంగళూరు, మే 3 : డిఫెండింగ్ ఛాంపియ న్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో బాగానే రాణిస్తోంది. 9 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్లో వారం రోజల పాటు గ్యాప్ రావడంతో ఆర్సీబీ తమ ఆటగాళ్లను విహారయాత్ర కోసం మాల్దీవులకు పం పింది. టోర్నమెంట్ కీలక దశ ప్రారంభమ య్యే ముందు తమ ప్లేయర్లను మానసిక ఉల్లాసంగా ఉంచేందుకు ఆర్సీబీ మేనెజ్మెంట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలను ఆ జట్టు స్టార్ పేసర్ జాకబ్ డఫీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే అహ్మదాబాద్ వేదికగా తాము ఆడిన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్‌పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మే 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది.