విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ నూతన అధ్యక్షుడిగా రావుల సతీష్
మంథని, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యం లో సోమవారం గోదావరిఖని లోని శారదా నగర్ విశ్వహిందూపరిషత్ భవన్ లోఅభ్యాస వర్గ కార్యక్రమం లో మంథని ప్రకండ అధ్యక్షులు, మిగిలిన బాధ్యులను తెలంగాణ ఉపాధ్యక్షులు న్యాలకొండ భాస్కర్ రావు , కరినగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ ప్రకటించారు.
మంథని ప్రకండ ఉపాధ్యక్షులుగా మదాడి నరేందర్ రెడ్డి, బోట్ల ఆంజనేయులు, దొరగోర్ల రవీందర్, సత్సంగ ప్రముక కొమురవెల్లి హరీష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గా వడ్లకొండ శ్రావణ్, సహా కార్యదర్శిగా గుండా శ్రీనివాస్, కజ్జం శ్యామ్, సత్సంగ్ సేవా ప్రముఖ్ సాయ షణ్ముఖ, ప్రచార ప్రముఖ్ తూర్పాటి రాము, గోరక్ష ప్రముఖ్ నూక శ్రీనివాస్, మందిర్మట్ ప్రముఖ్ మెడగొని రాజమౌళి గౌడ్, ఈ కార్యక్రమంలో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, జిల్లా కార్యదర్శి నాగుల మల్యాల సత్యం, జిల్లా సహా కార్యదర్శి అడిగొప్పుల రాజు, బజరంగదల్ జిల్లా సంయోజక్, సంపత్ పాల్గొన్నారు. ఈ బాధ్యతలకు సహకరించిన పెద్దపల్లి జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం జి కి, ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా కు ధన్యవాదములు తెలిపారు.






