వనపర్తిలో రాపిడో సేవలు ప్రారంభం
26-08-2026 12:25 PM
వనపర్తి ( విజయక్రాంతి ): ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపిడో సేవలను బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 180 మంది రైడర్లతో సేవలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, అవసరమైన పత్రాలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. రాపిడో సేవలతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, ఆర్టీఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






