మైనర్ బాలికపై అత్యాచారం
- కోటపల్లి పీఎస్ లో ఫోక్సో కేసు నమోదు
కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఓ మైనర్ బాలికలపై బాలుడు అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... చెన్నూరు మండలంలోని ఒక గ్రామాని (శివలింగాపూర్)కి చెందిన ఒక మైనర్ బాలిక కోటపల్లి మండలంలోని అమ్మమ్మ ఇంటి(కొండంపేట)కి వెళ్లింది. ఈ నెల నాలుగున ఉదయం గ్రామంలో ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు అత్యాచారానికి పాల్పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బాలిక తల్లిదండ్రులు చెట్టు కిందపడటంతో ఇలా జరిగిందని చెన్నూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఎంసీహెచ్ లో చేర్పించగా వారు సైతం అత్యాచారానికి గురైనట్లు వెల్లడించి వైద్యులే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.






