3 March, 2026 | 9:20 PM

అరణ్యంలోనే నిజమైన రంగులు

03-03-2026 07:37 PM

* ఏటీఆర్ పరిధిలో రంగు- ఏ- అరణ్యం

* పాల్గొన్న వివిధ పాఠశాల విద్యార్థులు

అచ్చంపేట: పర్యావరణహితమైన రంగులన్నీ నల్లమల్లలోని అవయారణ్యంలోనే ఉన్నాయని డిఎఫ్ఓ రేవంత్ చంద్ర అభిప్రాయపడ్డారు. అరణ్యంలోనే నిజమైన రంగులు ఉన్నాయనే సందేశాన్ని ఇవ్వడంలో భాగంగా.. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో రంగు- ఏ- అరణ్యం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆచంపేట అటవీ విభాగం అవుట్‌రిచ్ కార్యక్రమాల భాగంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఏటీఆర్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహించారు. 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు పర్యావరణ అవగాహన, సాంస్కృతిక అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి.. మనుషుల మధ్య ఉన్న అవినాభావాన్ని సూచిస్తూ ప్రత్యేక హోళీ వేడుకలను పర్యావరణ హితంగా నిర్వహించారు. ప్రకృతిలోనే నిజమైన అందం.. రంగులు ఉన్నాయని తెలియజేస్తూ ఐక్యత, ఆనందం పర్యావరణ బాధ్యత సందేశాన్ని వ్యాప్తి చేశారు. “వన్యప్రాణి సంరక్షణ వాటిని రక్షించడంలో మన పాత్ర” అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.

విద్యార్థులు అడవుల సంరక్షణ, అంతరించిపోతున్న జాతుల రక్షణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణ.. కాలుష్య నివారణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వన్యప్రాణి సంరక్షణపై అవగాహన పెంచడం వంటి చిన్నచిన్న చర్యల ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించవచ్చని సూచించారు. సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత నిర్వహణ కార్యక్రమం చేపట్టి, కలుపు మొక్కలను తొలగించారు.

* విద్యార్థులకు జంగిల్ సఫారీ

ప్రత్యేక ప్రోత్సాహకంగా.. పోటీలో విజేతలైన విద్యార్థులన వన్యప్రాణి దినోత్సవం లో భాగంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోని అమ్రాబాద్ డివిజన్లో  ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి అడవులు వణ్యప్రాణులపై  అవగాహన కల్పించి వారికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  ఈఈసి మననూర్లోని ఈఈసీ నుంచి మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జంగల్ సఫారీకి తీసుకెళ్లి అడవులు, జంతువులు, పక్షుల ప్రాముఖ్యత వివరించారు. ఫరాహబాద్ వ్యూ పాయింట్  నిజాం షిఖర్ గర్ చూపించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరాబాద్ అటవీశాఖ డివిజనల్ అధికారి రామ్మూర్తి, ఫ్లయింగ్ స్క్వార్డు, ఎఫ్డిఓ రామ్మోహన్, ఎఫ్ఆర్వో వీరేష్, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు  పాల్గొన్నారు.