గాంధీనగర్‌లో రంజాన్ తోఫా అందజేత
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండుగ సందర్భం గా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రంజాన్ తోఫా కానుకలను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గాంధీ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వినయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్‌లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు డి. కుమా ర్, బీజేపీ , బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సబర్మతి నగర్ బస్తీ వాసులు పాల్గొన్నారు.
పేదలకు అండగా నిలవాలి..
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పేద ప్రజలకు అండగా నిలవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ లోని రెయిన్బో హోమ్ బాలికల అనాధ ఆశ్రమం లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హరిహర పుత్ర అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు సుశీలమ్మ రెండో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరా జ్, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కొండా శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు ఎయిర్టెల్ రాజు, పట్నం నరేష్, అశోక్, సత్యనారాయణ బాబు, నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




