21 March, 2026 | 4:04 PM

ఘనంగా రంజాన్ వేడుకలు

21-03-2026 02:02 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శనివారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మసీదులకు చేరుకున్న ప్రజలు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి, దేశం శాంతి సౌభ్రాతృత్వాలతో అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని, పిల్లలు పెద్దలు ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సౌహార్ద వాతావరణంలో పండుగను జరుపుకోవడంతో వారిని అభినందించారు.