21 March, 2026 | 4:09 PM

మత సామరస్యానికి ప్రతీకగా పండుగలు

21-03-2026 02:04 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మతసామరస్సానికి ప్రతికగా పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు.పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని నూర్‌నగర్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణ, సహనం, దాతృత్వం , సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అనంతరం ఈద్గా వద్దకు వచ్చిన ముస్లిం సోదరులను ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, సీనియర్ నాయకురాలు మార్సుకోల సరస్వతి, నాయకులు అలీ బిన్ హైమద్, అన్సార్, హైమద్, నిసార్, రవి, అశోక్, సల్మాన్, అలాగే ఉమాదేవి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.