22 August, 2026 | 5:06 AM

ప్రిన్సిపాల్ హత్యకు నిరసనగా ర్యాలీ

22-08-2026 12:27 AM

పరిస్థితులు ఇలానే ఉంటే ఈ వృత్తిలో కొనసాగలేము

ఖమ్మం జిల్లాలో పాధ్యాయులు, యాజామాన్యాలు

ఖమ్మం, ఆగస్టు 21 (విజయక్రాంతి): ఇటీవల నల్గొండ జిల్లాలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ ‘ట్రెస్మా’ (తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఖమ్మం నగర వీధుల్లో కదం తొక్కారు. ఈ ర్యాలీని ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు ప్రారంభించారు.

ఈ కార్యకమంలో ఖమ్మం ట్రెస్మా అధ్యక్షుడు గుర్రం కాంతారావు, కార్యదర్శి నాయుడు. వెంకటేశ్వరరావు, కోశాధికా రి యెలిశెటి నాసరయ్య, ట్రెస్మా రాష్ట్ర నాయకులు కేసా. వీరన్న, ఐవీ రమణారావు, పి. రవి మారుత్, కొండపల్లి శశిధర్ రెడ్డి, కోటగిరి. ప్రవీణ్, కందుల శంకరయ్య, ఇస్మాయిల్, అంజన్ బాబు జిల్లా నాయకులు సం క్రాంతి రవికుమార్,మహ్మద్ అజారుద్దీన్, కె.వెంకటేశ్వరరావు, కె.ఉమాశంకర్, కెనారాయణరావు, వి.నాగార్జున, కె.మహేష్, పి.శ్రీని వాసరావు. జి.సౌభాగ్య, షేక్.హుస్సేన్, కె.భా స్కర్, యస్.ప్రకాశరావు, పి.ఉపేందర్, ఏ.సం దీప్ కుమార్, యస్.శ్రీవిద్య, పాలేరు నాయకులు పి.శివకృష్ణ, వి.శ్రీనివాస్, వైరా నేతలు బి.కిరణ్, ఖమ్మం డివిజన్ ట్రస్మా నాయకు లు జాఫర్ తదితరులు హాజరయ్యారు.