10 June, 2026 | 3:23 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

కుటుంబమంతా హాయిగా నవ్వుకునేలా రాకాస

03-04-2026 12:00 AM

నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ గురువారం ‘ప్రీ రిలీజ్ మ్యాడ్‌నెస్’ పేరుతో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “మాకున్న పరిధిలో ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ ఒకటి చేశాం. అలాంటి హాలీవుడ్‌తో పోల్చకండి. మా సినిమా నుంచి పూర్తి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తాం” అని తెలిపారు. కథానాయకి నయన్ సారిక మాట్లాడుతూ.. “రాకాస’ నా కెరీర్‌లో స్పెషల్‌గా నిలుస్తుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన్ను కలిసిన తర్వాత నాకు కన్నీళ్లు ఆగలేదు. మా ‘రాకాస’ గురించి ఆయన మాట్లాడటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.

దర్శకురాలు మానసశర్మ మాట్లాడుతూ.. “రాకాస’లో కథ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. మన జానపదాలు, సంస్కృతి అనేవి ఈ తరానికి అర్థమయ్యేలా, నచ్చేలా ఈ సినిమా తీశాం” అన్నారు. నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. “ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా మా ‘రాకాస’ ఉంటుంది. సోషల్ మీడియాను వాడని రామ్‌చరణ్ అన్న దగ్గరకే మా ‘రాకాస’ రీచ్ అయిందనప్పుడే మా సినిమా ప్రజల వరకు వెళ్లిందని నాకు అర్థమైంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మన్యం రమేశ్, జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య తదితరులు కూడా మాట్లాడారు.