20 August, 2026 | 11:38 AM

సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ

20-08-2026 10:32 AM

బోథ్, ఆగస్టు 20 (విజయక్రాంతి): భారతదేశాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి చేయడంలో స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పాత్ర ఎంతగానో ఉందని మాజీ ఎంపీ సోయం బాబురావు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ లో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధిలో గురుతర బాధ్యత నిర్వహించారన్నారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారి కుటుంబాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సహకార సంఘం మాజీ డైరెక్టర్ సట్ల ఉమేష్, సర్పంచ్ కురుమేఅన్నపూర్ణ. ఉప సర్పంచ్ పి.విజయలక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి పి చంటి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురిమి మహేందర్, కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ అద్యక్షులు నరసింహాదాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి పలువురు వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు,