20 August, 2026 | 12:26 PM

విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు

20-08-2026 11:31 AM

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

గణపురం ఆగస్టు 20 (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ర్యాంకు సర్టిఫికెట్లను ప్రధానం చేసి సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతర విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుర్రం వసంత మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.