20 August, 2026 | 12:27 PM

విద్యార్థుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

20-08-2026 11:32 AM

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట 

గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

విద్యార్థులకు యూనిఫామ్ లు బ్యాగుల పంపిణీ

గణపురం,ఆగస్టు 20 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మోడల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాంలు, పాఠశాల బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రి అందిస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో  అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుర్రం వసంత