23 April, 2026 | 3:42 AM

రాయల్ విక్టరీ

23-04-2026 02:07 AM

చిత్తుగా ఓడిన లక్నో

రాజస్థాన్ అద్భుత విజయం

రాజస్థాన్ స్కోరు 10.2 ఓవర్లలో 77/5... చివరికి చేసిన స్కోరు 159/6.. బదులుగా ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 2.5 ఓవర్లలో 11/3... 14.3 ఓవర్లలో 91/5..తర్వాత 18 ఓవర్లకు 119 ఆలౌట్..ఇదీ క్లుప్తంగా లక్నో, రాజస్థాన్ మ్యాచ్ పరిస్థితి. అసలు రాజస్థాన్ 120 పరుగులైనా దాటుతుందా అన్న అంచనాలు తలకిందులు.. ఈజీ టార్గెట్ ను లక్నో ఛేజ్ చేసేలా కనిపించినా తర్వాత చేతులెత్తేసిన వైనం.. వెరసి రాజస్థాన్ రాయల్ గా విక్టరీని అందుకుంది.a

లక్నో, ఏప్రిల్ 22: ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్ కు సరైన ఆరంభం దక్కలేదు. జైశ్వాల్ (22) పర్వాలేదనిపించినా వైభవ్ సూర్యవంశీ(8), జురెల్ (0) విఫలమయ్యారు. వీరంతా ఒక ఓవర్ వ్యవధిలోనే ఔటయ్యారు.

తర్వాత కెప్టెన్ జురెల్, హెట్ మెయిర్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కూడా స్వల్ప వ్యవధిలో ఔటవడంతో  120 పరుగులు కూడా చేయడం అనుమానంగానే కనిపించింది. ఈ దశలో రవీంద్ర జడేజా, ఫెరీరా మరోసారి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఫెరీరా 22 రన్స్ కు ఔటవగా.. జడేజా (29 బంతుల్లో 43) మాత్రం దూకుడు పెంచాడు. దూబేతో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.  తర్వాత ఛేజింగ్ లో మరోసారి లక్నో సూపర్ జెయింట్స్ చేతుతెత్తేసింది. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పనిచేయలేదు. ఆయుశ్ బదోనీ, పంత్, మార్కరమ్ ముగ్గురూ డకౌటయ్యారు. దీంతో కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మార్ష్ ఒకవైపు పోరాడుతున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ లేకుండా పోయింది.

ఆదుకుంటాడనుకున్న పూరన్ (25) భారీస్కోరు చేయలేకపోయాడు. మరోవైపు మిఛెల్ మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. దీంతో లక్నో 119 పరుగులకే ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3, బర్గర్ 2, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసారు.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: 159/6 ( జడేజా 43, జైస్వాల్ 22, హెట్‌మెయిర్ 22, రియన్ పరాగ్ 20 ;  షమీ 2/30, ప్రిన్స్ యాదవ్ 2/29, మోసిన్ ఖాన్ 2/17 )

లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: 119 ఆలౌట్ ( మిఛెల్ మార్ష్ 55, పూరన్ 22, హిమ్మత్ సింగ్ 15 ; ఆర్చర్ 3/20, బర్గర్   2/27,బ్రిజేశ్ శర్మ 2/18)