ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్‌ఐ
21-08-2026 12:20 AM
- వివాదం పరిష్కరించేందుకు రూ.50 వేలు డిమాండ్
- రూ.30వేలు తీసుకుంటూ పట్టుబడిన నిందితుడు
కామారెడ్డి, ఆగస్టు 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్‌ఐ ఆంజనేయులు గురువారం పట్టుబడ్డారు. సిమెంట్ దుకాణంలో వచ్చిన వివాదం పరిష్కరించేందుకు సిద్ధిరాములు నుంచి 50 వేల రూపాయలు ఎస్‌ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ముందుగా సిద్ధిరామం నుంచి రూ.10వేలు తీసుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని ఆయన నివాసంలో మరో రూ.30వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నివాసంలో, కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలో ఫైళ్లను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. సంబంధించి వివరాలపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.






