21 August, 2026 | 2:04 AM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

21-08-2026 01:15 AM

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షులు

ఖమ్మం, ఆగస్టు 20, (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ‘స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని యావత్ భారతదేశ ప్రజలు సద్భావనా దివస్ గా జరుపుకుంటున్నామని‘ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, శేఖర్ గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, విప్లవకుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు తూములూరి లక్ష్మీ నరసింహారావు, కిలారు అనిల్ కుమార్, బచ్చలకూర నాగరాజు, కొట్టే రాజశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.