21 August, 2026 | 1:27 AM

విద్యార్థుల హక్కులను కాలరాయొద్దు

21-08-2026 12:18 AM
  1. వెంటనే జీవో 97 వెనక్కి తీసుకోవాలి
  2. వారి పోరాటానికి బీఆర్‌ఎస్ అండ
  3. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): శాంతియుతంగా నిరసనను తెలిజేస్తున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు కలచివే శాయని, విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

రేవంత్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారని, ఇకముందు కూడా పాలిటెక్నిక్ విద్యా ర్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.