22 వరకు వర్షాలే
19-03-2026 02:24 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. గురువారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. 40 గంటల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గురువారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేస్తూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుతాయని తెలిపింది.




