6 June, 2026 | 6:40 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

06-06-2026 05:40 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) శనివారం కోల్‌కతా మెట్రోలో ప్రయాణించారు. అలాగే ఆయన ఆటో-రిక్షాలో కూడా ప్రయాణించారు. వైష్ణవ్ కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుని, నేరుగా పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు.

అక్కడ ఆయన ప్రయాణికులతో మాట్లాడి, సేవల పట్ల వారి అనుభవం గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి జగన్నాథ్ ఛటర్జీ, ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహాతోలతో కలిసి, ఆ మంత్రి జై హింద్ (విమానాశ్రయం) స్టేషన్ నుండి నోవాపారాకు మెట్రో రైలులో ప్రయాణించారు. రాబోయే ఐదేళ్లలో 60 నెక్ట్స్ జనరేషన్ రైళ్లను ప్రవేశపెడతామని ఆశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కోల్ కతా మెట్రో నెట్ వర్క్ ను పూర్తిగా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి- మధ్య  బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తామన్నారు.