ఇసుక అక్రమ రవాణాపై దాడులు
ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ ,
ఒక టిప్పర్, 5 ట్రాక్టర్లను ,అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కృష్ణ .మార్చి. 3. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని గుడే బల్లూరు గ్రామ శివారులోని కృష్ణానదిలో సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్ను, ఐదు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఆరుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి చేసినట్లు కృష్ణ ఎస్త్స్ర ఎస్. ఎం. నవీన్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా పై, కట్టడి చర్యలు భాగంగా కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడే బాల్లూరు గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని విశ్వాసనీయ సమాచారంతో ట్రాక్స్ ఫోర్స్ సిబ్బంది మరియు కృష్ణా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని వారు తెలిపారు.
ఈ యొక్క దాడుల్లో అరెస్టు అయిన వ్యక్తులు పూజారి శివప్ప కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా.గడ్డమీద రమేష్ గుడేబల్లూరు. గొల్ల నర్సింలు, కృష్ణ. కొలిమి రాజు. పళ్ళ అంజప్ప. ఎం రమేష్ , గుడేబల్లూరు. వారిని అదుపులో తీసుకొని సంబంధించిన సెక్షన్ల కింద కృష్ణ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కృష్ణ ఎస్సీ తెలిపారు.జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నిల్వలు, మరియు అమ్మకాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అలాంటి అక్రమ కార్యక్రమాలకు పై సమాచారము ఉన్న అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్త్స్ర హెచ్చరించారు.




