4 March, 2026 | 6:03 AM

ఘనంగా పొంగల్ మహోత్సవం

04-03-2026 12:29 AM

కేరళ సంఘం ఆధ్వర్యంలో అట్టుకల్ అమ్మవారి వేడుకలు

పటాన్చెరు, మార్చి 3 :భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో కేరళ సంఘం ఆధ్వర్యంలో అట్టుకల్ అమ్మవారి ఆశీస్సులతో పొంగల్ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కేరళ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేవాలయ ప్రాంగ ణాన్ని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.

ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో ఉన్న వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు.

స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయరీతిలో పొంగల్ నైవేద్యాన్ని సమర్పించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. కార్యక్రమంలో అనీష్, బిన్ను, సుదర్శన్, అనిల్, బిజు తదితరులతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సంపత్ గౌడ్, చిన్న, రాకేష్, మునీందర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆదర్శ్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.