కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా హోలీ
04-03-2026 12:30 AM
మెదక్, మార్చి 3 (విజయ క్రాంతి) :మెదక్ జిల్లా కలెక్టరేట్, అందనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల్లో హోలీ కార్యక్రమాల్లో రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ , అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రజలను ఉద్దేశించి &కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు




