14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్ గాంధీ

13-12-2025 04:14 PM
హైదరాబాద్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు(Shamshabad Airport) చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి,  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి 7.15 గంటలకు రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 10.30 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. రేవంత్- మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి సూచించారు.