22 May, 2026 | 10:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

జాతీయ రహదారుల కోసం కేంద్ర మంత్రికి వినతి

13-03-2026 01:49 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): న్యూఢిల్లీలో కేంద్ర రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) అధికారిక నివాసంలో శుక్రవారం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా వారిని హైదరాబాద్ - నాగపూర్ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం, బెల్లంపల్లి గడ్చిరోలి నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో అలైన్మెంట్ ఖరారు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. 

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి  హైదరాబాద్ - నాగ్ పూర్ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కోసం అలైన్మెంట్ ఖరారు చేసే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే బెల్లంపల్లి -  గడ్చిరోలి జాతీయ రహదారి విషయంలో ఫారెస్ట్ అనుమతుల విషయంలో ఉన్న సమస్యలను అధిగమిస్తామని కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు.