కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నర్ల గంగామణి మల్లేష్‌తో పాటు వార్డు సభ్యులు సురేందర్,బాలమణి వెంకయ్య,ఇందిరవ్వ పాపయ్య,చాకలి రుక్మిణి గంగయ్య,భాస్కర్, మాలావత్ రమేష్, ఉపసర్పంచ్ సూరయ్యలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ చూడలేదని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా యెల్లారెడ్డి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల మంజూరు జరగలేదని, మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే ఇందిరమ్మ ఇళ్లను భారీ స్థాయిలో మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేర్చారని కొనియాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మదన్ మోహన్ రావు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.






