కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు U DISE+ అన్ని వివరాలు వెరిఫై చేయాలి
* జిల్లా విద్యాధికారి బి. వాసంతి
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఆనందఖని ఉన్నత పాఠశాలలో గల జిల్లా ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న ప్రధానోపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాధికారి బి.వాసంతి పీజీఐ ర్యాంకింగ్ మీద, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో మన జిల్లా ర్యాంకింగ్ చాలా తక్కువగా ఉందని, మెరుగుపరచుకోవడానికి మనం ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు అన్నిటిని నమోదు చేయాలని సూచించారు.
కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు తమ పరిధిలో పాఠశాలల్లో అన్ని సరిగ్గా నమోదు చేసే విధంగా, 100% వెరిపై చేయాలని సూచించారు. ఖాన్ అకాడమీ కు సంబంధించిన ఆక్టివిటీస్ ను,అన్ని పాఠశాలలో అమలు చేయాలని తెలిపారు.సెక్టోరియల్ అధికారులు మాధవరావు, సతీష్ కుమార్, జానకి, జిల్లా సైన్స్ అధికారి బి సంపత్ కుమార్ లు ప్రస్తుతం పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.






