6 June, 2026 | 6:32 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ

06-06-2026 05:49 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్  సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ గ్రామ సభకు బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గోని  గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ  సిబ్బంది సేకరించే పొడి చెత్త, తడి చెత్తనీ వేరు పరచాలని, గ్రామ పరిశుభ్రత లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం విధించాలని, రానున్న వర్షంకాలంలో త్రాగునీరు కలుషితo కాకుండా ముంధస్తు చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీలలో పిల్లలకు పోషకాహారం, ప్రస్తుత స్మశానవాటిక లో కరెంట్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపురిత 6 హామీలు తో సబ్బoడ వర్గాలను మోసo చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి 99 రోజుల  ప్రణాళికని  ముందుకు తీసుకు వచ్చిందని ద్వజమెత్తారు.  గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కానీ అన్ని శాఖల అధికారులు ఎందుకు హాజరు కావటం లేదని, ప్రజా సమస్యలుకి సమాధానాలు  ఎవరు చెబుతారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం  ఎర్పడి 6 నెలలు గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి  పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేయకపోవడo దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ  పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి, వివిధ విభాగాలు ఉద్యోగులు, గ్రామస్థులు  తదితరులు పాల్గొన్నారు.