31 July, 2026 | 4:41 PM

క్వారీ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

31-07-2026 03:54 PM

మంచిర్యాల క్రైం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న ACC క్వారీ దుర్గామాత జాతర మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంచిర్యాల పట్టణ ఏసీపీ ప్రకాష్, పట్టణ సీఐ ప్రమోదరావులు దుర్గాదేవి ఆలయ కమిటీ సిబ్బందితో కలిసి శుక్ర వారం పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భద్రత ద‌ష్ట్యా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. క్వారీకి వెళ్లే దారిలో గల రాళ్లవాగు బ్రిడ్జినీ పరిశీలించిన అనంతరం జాతరకు వెళ్లే ప్రజలు కార్మెల్ స్కూల్ నుంచి గ్రీన్ సిటీ జంక్షన్, అండాలమ్మ కాలనీ మీదుగా వెళ్లాలని సూచించారు.