మరిపెడ గురుకులంలో ర్యాగింగ్
- నలుగురు విద్యార్థులపై సీనియర్ల దాడి
- గురుకులం ఎదుట తల్లిదండ్రుల ధర్నా
మహబూబాబాద్, మార్చి 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థుల పై ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యా ర్థులు ర్యాగింగ్‌కు పాల్పడి కొట్టిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. తమ పిల్ల లపై దాడి చేసిన వారిపై విచారణ జరిపి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదం డ్రులు మంగళవారం గురుకులం ఎదుట ధర్నాకు దిగడంతో ఈ ఘటన కలకలం సృ ష్టించింది.
తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ నెల 1న (ఆదివా రం) తల్లిదండ్రులు వారిని చూసేందుకు వచ్చిన సమయంలో ఇచ్చిన కూల్ డ్రింక్ రాత్రిపూట తాగుతున్నారు. అప్పటికే ప్రహరీ దూకి బయటకు వెళ్లి లోపలికి వస్తున్న ఇం టర్ విద్యార్థులను తొమ్మిదో తరగతి విద్యా ర్థులు గమనించారు. ఇది గమనించిన సీని యర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదుగురు వి ద్యార్థులపై తీవ్రంగా దాడి చేసి కొట్టినట్లు పేర్కొన్నారు.
దీంతో భయపడ్డ ఆ ఐదుగురు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పా రు. దీంతో వారు మంగళవారం పాఠశాలకు వచ్చి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, వార్డెన్, రాత్రిపూట భద్రత చూడాల్సిన ఉపాధ్యా యులు నిర్లక్ష్యం వహించారని, విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై దాడి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇంటర్ విద్యార్థులను ఇంటికి పంపించామని, వారి నుంచి సంజా యిషీ తీసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సి పాల్ వివరించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి నట్టు చెప్పారు.




