23 July, 2026 | 3:59 AM

ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి

23-07-2026 02:00 AM

ఎస్పీ నితికా పంత్

లింగాపూర్/ సిర్పూర్ యు, జూలై 22(విజయ క్రాంతి): పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. బుధవారం లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చే శారు. స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్లు, కేసు డైరీలు, పెం డింగ్ కేసులు, ఆయుధాగారం, లాక్‌అప్, సీసీ కెమెరా లు, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూ చనలు చేశారు.పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, జనరల్ డైరీ, సీసీటీఎన్‌ఎస్ నమోదును ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు.మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలు, గుట్కా, గుడుంబా, జూదం, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, 24 గంటల పెట్రోలింగ్ నిర్వహించి బీట్, కమ్యూనిటీ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, జైనూర్ సీఐ రమేష్, ఎస్‌ఐలు సురేష్, కొమురయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.