4 May, 2026 | 1:48 AM

పంజాబీ.. నా అస్తిత్వం

04-05-2026 12:28 AM

కథానాయిక రాశీ ఖన్నా.. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఈసారి కాస్తా రూట్ మార్చింది. తనలోని నటనను నిరూపించుకునేందుకు ఈసారి డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసేందుకు పోలీసు ఆఫీసర్‌గా అవతారం ఎత్తింది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లరే ‘లుఖ్కే’. ఈ వెబ్ సిరీస్ ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌లోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని రాశీ ఖన్నా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

‘లుఖ్కే’లో “నేను గుర్బానీ అనే పోలీసు అధికారిణిగా కనిపిస్తా.. నేను ఎన్నో భాషల్లో సినిమాలు చేసినప్పటికీ, పంజాబీ నా అస్తిత్వం. నా మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ పాత్ర పోషించడం వల్ల నాకు సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇస్తుంది. నేను పోషించిన పాత్ర కూడా పంజాబీనే. ఆ పాత్రలో నటించడానికి ఇదీ ఒక ప్రత్యేక కారణమే. ఇక ఈ పాత్రలో నటించడం తనకు ఎంతో స్పెషల్‌” అని రా చెప్పుకొచ్చింది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగుతున్న ఈ ఈ సిరీస్లో మరో యంగ్ బ్యూటీ పాలక్ తివారీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.