గుప్పుమంటున్న హుక్కా పొగ
ఎల్బీనగర్ లో హుక్కా సెంటర్లపై దాడులు, 37 మంది అరెస్టు
ఎల్బీనగర్, మార్చి 21 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో హుక్కా పోగ గుప్పుమంటుంది. హుక్కా సెంటర్లపై ఎల్బీనగర్ డివి జన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్, నాగోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు హుక్కా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఎల్బీనగర్ ఏసీపీ కృషయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వ హించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేహరి కేఫ్ హుక్కా సెంట్ప పోలీసులు దా డులు నిర్వహించి భారీగా హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఎల్బీనగర్లోని ఎల్వోసీ హుక్కా సెంట్పనా రెయిడ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎల్బీనగర్, నాగోల్ పరిధిలోని ఎల్వోసీ, సేహరి కేఫ్‌ల్లో హుక్కా సెంటర్లు నడుపుతున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. హుక్కా సెం టర్లను అనధికారికంగా, చట్ట విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలిపారు. దాడుల్లో హుక్కా సంబంధిత మెటీరియల్, పైపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాగోల్ సుమారు 20 మంది, ఎల్బీనగర్ లో 17 మంది హుక్కా తాగుతూ పట్టుబడ్డారు. వీళ్లంతా బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, బండ్లగూడ, ఎల్బీనగర్ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చి ఇక్కడ హుక్కా సేవిస్తున్నారు. నాగోల్ సేహరి హుక్కా కేఫ్ ఒక్కసారి హుక్కా తాగితే రూ. 700 వసూ లు చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 37 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఎల్వోసి హుక్కా సెంటర్లో 12 మంది యువకులను అదుపులోకి తీసుకుని, వారి రక్త నమూనాలు సేకరించారు.




