పత్తి చేనులో పసికందు
22-03-2026 01:16 AM
శిశు సంక్షేమ శాఖకు అప్పగింత
కాగజ్‌నగర్, మార్చి 21 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలం నల్లగొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్ శివారులోని ఓ పత్తి చేనులో పసికందును గుడ్డలో చుట్టి పడవేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా శిశువు ఆరోగ్యంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణం పేదరికమా? మానసిక సమస్యల? లేదా కుటుంబ ఒత్తిడా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




