20 May, 2026 | 2:15 AM

విప్లవ చైతన్య దీప్తి పుచ్చలపల్లి

20-05-2026 01:02 AM

మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): త్యాగం, నిరాడంబరత, విప్లవ చైతన్య దీప్తి దివంగత నేత పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు మహబూబాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు చేతుల్లోనే సమాజ మార్పు ఉందని, ఏకం, పోరాటం, త్యాగం ఇవే మన విజయానికి మార్గం అని నినదించిన మహోన్నత విప్లవకారుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు, సీపీఐ(ఎం) తొలి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. దివంగత పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి బానోత్, సీతారాం నాయక్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలోసీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న,జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి,దూడ్డెలా రామూర్తి పట్టణ కమిటీ సభ్యులు కుమ్మరి కుంట్ల నాగన్న, చాగంటి భాగ్యమ్మ, బానోత్ వెంకన్న, తోట శ్రీను, మందుల మహేందర్, లాలయ్య,గౌని వెంకన్న, రజాక్, వార్డు కౌన్సిలర్ బానోత్ బాబు తదితరులు పాల్గొన్నారు.