11 August, 2026 | 2:10 PM

అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

11-08-2026 12:32 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని లింగంపేట గ్రామం నుండి  సనుగుల, రామారావు పల్లె, కిష్టంపేట, గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగంపేట గ్రామం నుండి సనుగుల ప్రధాన రహదారిపై వర్షపు నీళ్లు, పొలం, ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులకు అలాగే రైతులు, కాలి నడక నడిచే వారికీ ఇబ్బంది అవుతుంది, రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి దాపురించింది.ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.