20 May, 2026 | 3:47 AM

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

20-05-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, మే 19(విజయక్రాంతి):భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ పితామహుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు  కామ్రేడ్ స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు మేడ్చల్ మండల సిపిఎం కార్యదర్శి ఎం నరేష్ తెలిపారు.మంగళవారం మేడ్చల్ సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు తెలియజేశారు.

నిరాడంబరతకు నిష్కలంక రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచిన సుందరయ్య సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని నరేష్ స్పష్టం చేశారు.అంతే కాకుండా వందల ఎకరాల సొంత ఆస్తిని పేద ప్రజల కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య ఒక్కరేనని ఆయన కొనియాడారు.నైజాం నవాబుల అరాచకత్వాన్ని రజాకార్ల దౌర్జన్యాలకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన విరోచిత తెలంగాణ సాయుధ పోరాటాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన ధీరుడిగా సుందరయ్య పేరు నిరంతరం గుర్తుండిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు రమేష్.నర్సింగ్ రావు.కొమరయ్య.వెంకటేష్.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.