19 May, 2026 | 6:21 PM

Breaking News

సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేయాలి

19-05-2026 05:18 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక పూసాల పెద్దమ్మ గుడి వద్ద సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్యని స్మరించుకోవడం అంటే నేడు భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను అర్థం చేసుకొని కార్మిక వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.

అప్పుడే కార్మిక వర్గo ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య  భూస్వామ్య అగ్ర కులంలో పుట్టిన తన ప్రజా జీవితంలో వాటన్నింటినీ విసర్జించి బాల్య దశ నుండే కుల వివక్షకు, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా తన ఊరు, తన కుటుంబం నుండి పోరాటాన్ని ప్రారంభించారని స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రూ లాంటి నాయకులతో కలిసి పాల్గొన్నారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను వెలిగిత్తి చాటారని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో  రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షులు తాండ్ర అంజయ్య, సుల్తానాబాద్  సిఐటియు మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు , రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం కార్యదర్శి నౌవుడ్ల బ్రహ్మచారి, అనంతుల శ్రీనివాస్, సదయ్య, లింగయ్య, రమేష్, ప్రసాద్, మహేష్, సుధాకర్ రావు, కుమార్, సతీష్, శ్రీనివాస్, రాజేశం, ప్రభాకర్, ఓదెలు, కొమురయ్య, మల్లేష్, తిరుపతి, మహేందర్, సంపత్, సురేష్, తదితరులు ఆపరేటర్స్ పాల్గొన్నారు.