19 May, 2026 | 6:22 PM

Breaking News

అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఎందరికో ఆదర్శం

19-05-2026 05:14 PM

ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు

సత్తుపల్లి,(విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రావి వీరవెంకయ్య భవనంలో సిపిఎం సత్తుపల్లి టౌన్ కమిటీ సభ్యులు మోరంపూడి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా సుందరయ్య  చిత్రపటానికి సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, పూలమాలవేసి  నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ... దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుల్లో ఉద్యమ నిర్మాతల్లో ఒకరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు స్వతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు గాంధీగా సుందరయ్య  జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అని ఆయన అన్నారు.

కుల వ్యవస్థను నిరసిస్తూ అసలు సుందర్ రామిరెడ్డి అనే పేరును రెడ్డి అనే సూచికను తొలగించుకున్నాడ కుల వివక్షత అంటరాని తనంపై అనేక పోరాటాల నిర్వహించిన ఘనుడన్నారు, దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించారు. సుందరయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి సబ్బండ వర్గాలకు ఆదర్శ అన్నారు సుందరయ్య జీవితం ఒక కమ్యూనిస్టులకే కాకుండా అన్ని రంగాల ప్రజలకు ఆదర్శమని అన్నారు.

సమాజంలోని కుల వ్యవస్థ అంటరానితనం చూసి చలించిపోయారన్నారు అసమానతలు లేని అంతరాలు లేని సమాజం కోసం ఆయన విశేష కృషి చేశారని ఆయన జీవితం అనేక త్యాగాలతో నిర్మితమైందని అన్నారు.  నేడు నిజం అరుదైన విషయంగా మారిపోయింది. అబద్ధం అభివృద్ధి ముసుగేసుకుని ఆధునికతగాచలామనవుతుందన్నారు. నేడు ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న వేళ సుందరయ్య లాంటి నేతలు అవసరం అన్నారు బహుళ జాతి కంపెనీలు రైతుల భూములను ఆక్రమించినప్పుడు విదేశీ పెట్టుబడును కార్మిక శక్తిని చరబడుతున్నప్పుడు ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు తుడచి పెడుతున్నప్పుడు సుందరయ్య జీవితం ఎనలేని బలం ఇస్తుందన్నారు ఎదురు తిరిగే తెగవనిస్తుందన్నారు.

ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు మతోన్మాదంలో మగ్గిపోతున్న సామాజిక చైతన్యానికి సుందరయ్య దారి చూపాడని అన్నారు. ఓ ప్రత్యామ్నాయ విప్లవ శాస్త్రంగా స్ఫూర్తినిస్తాడన్నారు. సత్యం కోసం జీవితాన్ని ధారపోసిన విశ్వ మానవ పతాకం అవుతాడని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కోలిక పోగు సర్వేశ్వరరావు, చావా రమేష్, ఓలేటి శ్రీహరి, రాము, రత్న కుమారి పుష్పవతి, భాస్కర్, వెంకటేశ్వరావు లక్ష్మణ్ ప్రసాద్ రఫీ, వలి, సైదా ఖాదర్ మీరాజ్, భాష, బాబు, జిలాని, బడే మరియు తదితర కార్యవర్గ నాయకులు  పాల్గొన్నారు.