31 July, 2026 | 5:42 PM

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ వస్తువుల పంపిణీ

31-07-2026 04:55 PM

బైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తు  మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.