జీపీలో డిగ్రీ కళాశాల ప్రవేశాలపై ప్రచారం చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ లలో మైక్ తో పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో అడ్మిషన్స్ కొరకు ప్రచారం చేపించూమని అడిషనల్ కలెక్టర్ (LB) విజ్ఞాపన పత్రం అందించినట్టు డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలిపారు. గురువారం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు సదుపాయాలను వివరించారు అనంతరం అడ్మిషన్ బ్రోచర్లను విడుదల చేశారు స్పందించి వెనువెంటనే గ్రామ పంచాయతీ లలో అనౌన్స్ మెంట్ చేయుమని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు అసిస్టెంట్ వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ దోస్త్ కోఆర్డినేటర్ శ్రీహరి డాక్టర్ పి జి రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ కట్ట రమేష్ రెడ్డి ప్రొఫెసర్లు పాల్గొన్నారు .






