12 August, 2026 | 2:20 AM

దమ్మాయిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం

12-08-2026 12:55 AM

భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

జవహర్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): దమ్మాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. కారు ఢీకొనడంతో స్కూటీపై ప్ర యాణిస్తున్న భర్త అక్కడికక్కడే మృతి చెంద గా, భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఎస్‌హెచ్‌ఓ సైదులు తెలిపిన వి వరాల ప్రకారం.. నాగారం లక్ష్మీనగర్ కాలనీ కి చెందిన షేక్ నాగూర్ షరీఫ్ (59), ఆయన భార్య షేక్ కరీమున్నీసా (56) సోమవారం రాత్రి బాలాజీనగర్ నుంచి దమ్మాయిగూడ వైపు స్కూటీపై వెళ్తున్నారు.

రాత్రి 11.30 గంటల సమయంలో విశాంక్ మోటార్స్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ స్కూటీని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో దంపతులు రోడ్డుపై పడిపోగా స్థానికులు వారిని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి షరీఫ్ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. భార్య కరీమున్నీసా తల, వెన్నుపూసకు తీవ్ర గాయా లు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఈసీఐఎల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను సందీగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.