ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం
ఇల్లు, పింఛన్లపై నిలదీత
ఎవరికోసం పెట్టారని.. ప్రజల నిరసన
అచ్చంపేట ఏప్రిల్ 02: 'ఇందిరమ్మ ఇల్లు పేరుతో 5 లక్షలు ఇచ్చానని చెబుతున్నారు ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు. దాని నిరూపించాలి. చాలా మందికి తొలగించారు. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న చెబుతున్నారు. అవి ఎక్కడ అమలు చేశారు చూపించాలని' 15వ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అచ్చంపేటలోని 20 వార్డులలోనీ వివిధ ప్రాంతాలలో ప్రజాపాలన ప్రగతివేదిక వార్డు సభలను ఆయా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన నిర్వహించారు. అందులో భాగంగా అచ్చంపేటలోని 15వ వార్డు పరిధిలోని మైనార్టీ బిల్డింగ్లో నిర్వహించిన సభలో ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వం చెబుతున్న పథకాలు ఏవి తమకు అందడం లేదని సమావేశానికి హాజరైన ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను నిలదీశారు. నిజమైన అర్హులేవరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో డబల్ బెడ్ రూమ్ లని ఇస్తే వాటిని తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆగ్రహాలతో సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వార్డు కౌన్సిలర్ మనోహర్ ప్రసాద్ ఆక్షేపించారు. ప్రజలను మోసం చేసేందుకే ప్రజా పాలన సభలను నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుని రక్షిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు శారదమ్మ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.




