ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్
సన్మానించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
పెద్దపల్లి, దర్మారం, ఏప్రిల్ 02 (విజయ క్రాంతి): ధర్మారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్ సంగా రంజిత్ కుమార్ యాదవ్ ను ధర్మారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాఊ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంగ రంజిత్ కుమార్ యాదవ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కొడారి మంగతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
వైస్ ప్రెసిడెంట్ గా బంగిటపు కొమురయ్య, జనరల్ సెక్రటరీగా వీరపాల్ మైదారం, సెక్రటరీ గా ఇరుగురల్ల మహేష్, ట్రెజరర్ గా డి. రాజు, కార్యవర్గ సభ్యులుగా నందాల మల్లేష్, భుక్యా సంగీత, సున్నం రాజయ్య, కూసా శ్రీ వాణి, మండ శ్రీనివాస్, కల్వ సుగుణ ఎన్నికయ్యారు. తన పై నమ్మకంతో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడిగా నియమించిన సర్పంచ్ లకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రంజిత్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.




