మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతుగానే ఉందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఛైర్మన్ కు లేఖ రాశానని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంకా పొడిగించడం మంచిది కాదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక చర్చ పెట్టండి.. అన్ని పక్షాలు పూర్తి మద్దతిస్తాయని సూచించారు. రాజ్యసభలో అమరావతి బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ విషయం ఏం చేశారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.




