అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
02-04-2026 01:23 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సందర్శించారు.గురువారం కేస్లాపూర్, టీఆర్ నగర్ , బజర్ వాడి లోని ప్రాంతాల్లో ఉన్న హనుమాన్ ఆలయాలకు వెళ్లిన ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.




