12 August, 2026 | 2:21 AM

పీఆర్సీపై ఇక జాప్యం వద్దు.. వెంటనే ప్రకటించాలి

12-08-2026 12:53 AM

కూసుమంచి మండల ఉపాధ్యాయులకు పీఆర్‌టీయూ పిలుపు

కూసుమంచి, ఆగస్టు 11 (విజయక్రాంతి): పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నూతన పీఆర్సీని ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతోందని పిఆర్ టి యు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు తెలిపారు.

ప్రభుత్వం ఇకనైనా జాప్యం చేయకుండా వెంటనే నూతన పీఆర్సీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన పి ఆర్ టి యు ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్లో నిర్వహించనున్న మహాధర్నాకు కూసుమంచి మండలంలోని ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని, ఈ పోరాటంలో ఉపాధ్యాయులందరూ ఐక్యంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. 17న ఖమ్మంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయడం ద్వారా ఉపాధ్యాయుల ఐక్యతను ప్రదర్శించి, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని శీలం ఆంజనేయులు పిలుపునిచ్చారు. పి ఆర్ టి యు కూసుమంచి మండల ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.వి. రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదే వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.