12 August, 2026 | 3:20 AM

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగం సాధించిన డిగ్రీ విద్యార్థి

12-08-2026 12:53 AM

నాగోల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): లెక్చరర్స్ కాలనీ డివిజన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్కు చెందిన బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇస్లావత్ హనుమంతు టీఎస్‌ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ (శ్రామిక్) పోస్టుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ ఇన్చార్జ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతును ప్రిన్సిపాల్ సురేష్ బాబు అభినందిస్తూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.