30 August, 2026 | 10:55 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

టీచర్లకు నష్టం కలిగించే అంశాలు తొలగించాలి

23-04-2026 01:50 AM

మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికలో ఉపాధ్యాయులకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుకు వినతిపత్రం సమర్పించారు.

విద్యాకమిషన్ నివే దికలో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయన్న అంశాన్ని తొలగించాలని కోరారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, సాం ఘిక శాస్త్రానికి సంబంధించిన మ్యాప్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతోపాటు సీఎంతో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.