విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 12(విజయక్రాంతి): విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మంచి విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, వంటశాల, సరుకుల నిల్వ గది, తరగతి గదులను పరిశీలించారు.
వంటశాల పరిశుభ్రంగా ఉంచాలని, సరుకులను క్రమబద్ధంగా నిల్వ చేయాలని సిబ్బందికి సూచించారు. మెను పట్టికను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజూ మెనూలో పేర్కొన్న విధంగా ఆహారం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థినులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు.
అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ గురుకుల పాఠశాల/కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో సర్వే ల్యాండ్ రికారడ్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 50 రోజుల శిక్షణ అనంతరం పరీక్షల్లో ఎంపికైన 53 మంది లైసెనస్డ్ సర్వేయర్లకు కలెక్టర్ కె. హరిత పత్రాలు పంపిణీ చేశారు.




